ఏపీ ప్రభుత్వానికి ఎస్పీ చరణ్ ధన్యవాదాలు!
ఏపీ సీఎం జగన్ కి ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ధన్యవాదాలు తెలిపాడు. నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు చరణ్ తండ్రి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల చరణ్ హర్షం వ్యక్తం చేశాడు
ఏపీ సీఎం జగన్ కి ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ధన్యవాదాలు తెలిపాడు. నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు చరణ్ తండ్రి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల చరణ్ హర్షం వ్యక్తం చేశాడు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని చరణ్ అభిప్రాయపడుతూ సీఎం జగన్ కి, ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక బాలు దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని తన అద్భుతమైన గొంతుతో అలరించారు.. జనరేషన్ మారిన కొద్ది అయన కూడా మారుతూ కథానాయకుల గొంతుకు తగట్టుగా పాటలు పాడుతుండేవారు. అందుకే బాలు పాట ఎప్పటికి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో ఆకట్టుకున్నారు. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితేనే ఆ పాటకి ఓ అందం వస్తుంది.
అసలు ఆ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా అనిపించేది. అలా ఒక భాష నుంచి ఒక పాట నుంచి దాదాపుగా 16 భాషల్లో 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులని సొంతం చేసుకున్నారు.అటు బాలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సెప్టెంబర్ 25న చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో మరణించారు.