బాలు.. మీరు ఆ విషయంలో మాట తప్పారు!

SP Balasubramaniam : అవును.. నిజంగా ఎస్పీ బాలు మాట తప్పారనే చెప్పాలి. అయనకి ముందుగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆగస్టు 11న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు.

Update: 2020-09-25 13:12 GMT

sp balasubramaniam

SP Balasubramaniam : అవును.. నిజంగా ఎస్పీ బాలు మాట తప్పారనే చెప్పాలి. అయనకి ముందుగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆగస్టు 11న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు అయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. తనకి గత రెండు, మూడు రోజులుగా ఒంట్లో నలతగా ఉందని, జలుబు, జ్వరం కూడా ఉండడం వలన అసౌకర్యంగా అనిపించడంతో ఆసుపత్రికి వచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయగా, పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా వెల్లడించారు.. టెస్టుల్లో కరోనా లక్షణాలు స్వల్పం గానే ఉన్నాయని, స్వీయజాగ్రత్తలు పాటించడంతో మందులు వాడుతూ సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండమని డాక్టర్లు సలహా ఇచ్చినట్టుగా అయన వెల్లడించారు.

అయితే కుటుంబసభ్యుల క్షేమం దృష్ట్యా తాను ఆసుపత్రిలో చేరినట్టుగా వెల్లడించారు.. ఇక్కడికి వచ్చాక ప్రస్తుతం జ్వరం తగ్గిందని, మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతానని చాలా ధీమాగా చెప్పారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిన బాలు.. యాబై రోజులుగా అక్కడే ఉండిపోయారు. మా బాలు త్వర‌గా కోలుకోవాల‌ని అభిమానులతో పాటుగా ప్రతి ఒక్కరు ఎన్నో ప్రార్ధన‌లు చేశారు. కానీ అవేమి ఫలించలేదు.. బాలు ఈ రోజు మ‌ధ్యాహ్నం 1.04ని.ల‌కు క‌న్నుమూసినట్టుగా వైద్యులు, బాలు తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. బాలు మీరు వస్తానని చెప్పి ఆ మాట తప్పారు అంటూ అయన అభిమానులు ఆ వీడియోని చూసుకుంటూ కన్నీటిపర్యతం అవుతున్నారు.

ఇక ఎస్పీ బాలు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. అయన పార్థివదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి నుంచి చెన్నై సమీపంలోని మహలింగపురం కామదార్ నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం వరకు ఇంటి వద్దనే బాలు భౌతికకాయం ఉండనుంది. ఆ తర్వాత అభిమానులు సందర్శన కోసం శనివారం ఉదయం సత్యం థియేటర్‌కు తీసుకెళ్లనున్నారు. బాలు నివాసం వద్దకు ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన గాయకుడి భౌతికకాయం వద్ద అశ్రునివాళి అర్పిస్తున్నారు. శనివారం తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో తమరాయిపక్కంలోని ఆయన ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చేసిన అంతిమయాత్ర రథం సిద్ధంగా ఉంచారు.

Tags:    

Similar News