Shruti Haasan: భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న శృతి హాసన్

Shruti Haasan: బాలయ్య సినిమాకోసం భారీ గా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్న హీరోయిన్

Update: 2021-11-01 16:26 GMT

బాలకృష్ణ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్న శృతి హాసన్ (ఫైల్ ఇమేజ్)

Shruti Haasan: ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బిజీగా ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట శ్రుతిహాసన్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదట. కానీ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో తన కి సూపర్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా కాబట్టి ఆలోచనలో పడింది శృతిహాసన్.

అయితే నిర్మాతలు కూడా భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం తో శృతి హాసన్ ఈ సినిమాకి ఓకే చెప్పేసిందట. తాజా సమాచారం ప్రకారం శ్రుతిహాసన్ ఈ సినిమా కోసం ఏకంగా రెండున్నర కోట్ల రెమ్యూనరేషన్ గా తీసుకోబోతోందట. నిజానికి ఈ మధ్య కాలం లో సీనియర్ హీరో లకి హీరోయిన్ లు దొరకటం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలకి హీరోయిన్లు ని ఎంపిక చేయటం దర్శకులకి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే శృతిహాసన్ కు రెమ్యూనరేషన్ ఎక్కువైనా పర్లేదు అని నిర్మాతలు ఈ సినిమా కోసం ఆమె ని ఎంచుకున్నారు అని తెలుస్తోంది. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News