Tollywood: హాలీవుడ్‌లో ఓకే.. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ ఎవరూ ఈ ప్రయోగం చేయరా?
Tollywood: తెలుగులో చంద్రముఖి, బాహుబలి, మగధీరను ఒకే సినిమాలో పేరడీ పాత్రలతో చూపించి కామెడీ పండించాలని కోరుతున్నారు.
Tollywood:సాహిత్యం, సంగీతం, నాటకం, టెలివిజన్ సినిమా, యానిమేషన్ వేదిక ఏదైనా, మంచి పేరడీ చక్కటి వినోదం మనస్సులను రంజింపజేయడానికి ఆనందింపజేయడానికి ఖచ్చితంగా ఉండాల్సిందే. సాహిత్యంలో అయితే శ్రీశ్రీ రచనలు 'జరుక్ శాస్త్రి'గా ప్రసిద్ధుడైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఇలా పేరడీ రాశారు. మహాప్రస్థానం'లో శ్రీశ్రీ 'నవకవిత' శీర్షికన...''సిందూరం, రక్తచందనం..బందూకం, సంధ్యారాగం..పులిచంపిన లేడినెత్తురూ ..ఎగరేసిన ఎర్రనిజెండా అంటూ శ్రీశ్రీ కవిత ఎంత ఉద్వేగం కలిగిస్తుందో, ''మాగాయీ కందిపచ్చడీ ఆవకాయ, పెసరప్పడమూ..తెగిపోయిన పాతచెప్పులూ అంటూ జరుక్ శాస్త్రి పేరడీ కవిత అంతకు మించి నవ్వులు పూయిస్తుంది.
ఒక సాహిత్యంలోనే కాదు సినిమాల్లో కూడా పేరడీ ఉంది. సినిమాల్లో పేరడీ ఒక భాగం అయిపోయింది. ఇతర సంగీత చర్యలను వారి పాటలను పేరడీ చేసే చాలా మంది కళాకారులు లేదా బృందాలకు వృత్తిగా మారింది. రెండున్నర గంటల సినిమాలో ఒక పేరడీ సీన్, సాంగ్ క్రియేట్ చేయడం కష్టమే. తెలుగు చిత్ర పరిశ్రమలో పేరడీ అనే పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదినే అనుకుంటా. సినిమాల్లో పేరడీ సాంగ్స్, పేరడీ సీన్స్ చూసిన ప్రేక్షకులు గుడుపుబ్బా నవ్వుతారు. కొంత మంది డైరెక్టర్లు ప్రేక్షకులను కాస్త నవ్వించడానికో, సినిమా బోరింగా అనిపించకుండా దాని నుంచి ఆడియన్స్ ఆలోచనను మళ్లించడానికో పేరడీ సీన్స్ ,పేరడీ సాంగ్స్ ప్రత్యేకంగా పెడతారు.
ఒక ఉదహారణగా మనం చెప్పుకోవాలంటే 'సినిమా చూపిస్తా మామా' చిత్రంలో బ్రహ్మానందం చేసిన సన్నీవేశాలు. ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమాలో ద్వితీయ భాగంలోని సీన్స్‌తో పోలీ ఉంటాయి. కామెడీ చిత్రాలు సుడిగాడు సినిమా పూర్తి పేరడి చిత్రమే. 'ఎవడి గోల వాడిదే' సినిమాలో అయితే సాంగ్స్ అన్ని పేరడీ పాటలే. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలో బ్రహ్మీ చేసిన రేడియేటర్ ' గ్లాడియేటర్' అనే హాలీవుడ్ సినిమాలోని సీన్స్ ప్రేక్షకులకు గుర్తుతెస్తాయి.
వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్ గోపాల్ వర్మ కూడా పేరడీ చేశాడు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే చిత్రంలో 'నేనే కేఏ పాల్' పాట ఒకటి కాగా, నారా లోకేష్‌పై సాగే.. 'పప్పు లాంటి అబ్బాయి' మరొకటి. కాగా ఇవి రెండు పాటలు.. టాలీవుడ్‌లో ఇది వరకు వచ్చిన పాటలకు పేరడీ కావడం విశేషం. 'నేనే కేఏ పాల్' సాంగ్ 'హృదయకాలేయం'లోని 'నేనే సంపు' పాటకు పేరడీ కాగా.. 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ 'అభినందన' చిత్రంలోని 'చుక్కలాంటి అమ్మాయి' పేరడీ గీతమే.
అక్టోబర్ 9, 1915 న పుక్ పత్రికలో వచ్చిన వ్యంగ్య రాజకీయ కార్టూన్. "నేను నా అమ్మాయిని ఓటరుగా పెంచలేదు" అనే శీర్షిక మొదటి ప్రపంచ యుద్ధ వ్యతిరేక పాట " ఐ డిడ్ నాట్ రైజ్ మై బాయ్ టు ఎ సోల్జర్ " అనే పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. "పేరడీ ...ఒక అనుకరణ, అదీ పెద్ద సహా కళనే ఎప్పుడూ పేరడీ వ్యయంతో మాత్రమే రాదు" అని సాహిత్య సిద్ధాంతకర్త లిండా హట్చోన్ పేర్కొన్నారు. 20 వ శతాబ్దంలో, పేరడీని కేంద్రంగా అత్యంత ప్రాతినిధ్యగల కళాత్మక అంశంగా గుర్తించారు.
హాలీవుడ్ లోనూ పేరడీ చిత్రాలు ఉన్నాయి. పేరడీలక కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్ అనే చెప్పాలి. జేమ్స్ బాండ్ ప్రజాదరణకు ఆజ్యం పోసిన 1960ల నాటి గూడాచారి చిత్రం పేరడీ చిత్రమే. మొదట పేరడీ చిత్రం 1960లో జేమ్స్ బాండ్ సిరీస్ నుంచి చేశారు. పేరడీ ఏకంగా చిత్రాలు భారీ బడ్జేట్‌తో తెరకెక్కాయి. సూపర్ మెన్, 300యోధులు, కరేబియన్ కింగ్స్, నార్నీయా, Fantastic 4, Xmen, ద డెవెన్సీ కోడ్, హ్యారీపోటర్ , జేమ్స్ బాండ్ వంటి చిత్రాల్లోని అన్ని పాత్రలు కలిపి EPIC Movie అనే సినిమాగా వచ్చాయి. ఈ చిత్రంలో నటీనటులు పండించింన కామెడీ ఇప్పటీకీ గుర్తిండిపోతుంది. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ పేరడీ చిత్రాలు ఎప్పుడు టీవీలో వచ్చిన మంచి ఆదరణ లభిస్తోంది. (1640 లో) తులిప్ నాటకాన్ని కొందరు కళాకారులు పేరడి చేశారు.
ఇలా EPIC Movieపే కాదు, Date Movie, Disaster Movie, Meet The Sparntans, Sports Movie, ఇలా వరుసగా పేరడీ చిత్రాలు వచ్చాయి. Hunted House అంటూ ఒక హార్రర్ చిత్రానికి కూడా పేరడీ వచ్చాయి. సూపర్ హీరోలా చిత్రలకు పేరడీలు వచ్చాయి. ఒకటి కాదు ఏకంగా నాలుగు ఐదు సిరీస్ లు వచ్చాయి. Scary Movie అయితే ఏకంగా ఐదు పార్టులుగా విడుదలై సంచలనం సృష్టించింది.
Disaster Movie అయితే హల్క్, ఐరన్ మెన్, హెల్ బాయ్, స్పైడర్ మెన్, బ్యాట్ మెన్ వంటి సూపర్ హీరో క్యారెక్టర్లతో కామెడీ పండిచారు దర్శకుడు. Meet The Sparntans అయితే పూర్తి అడల్ట్ కామెడీతో 300 యోధులతో నడిపిస్తాడు. యుద్దానికి వెళ్లి నిద్రపోవడం వంటి సీన్స్ పండిచారు.
చాలా పేరడీ చలనచిత్రాలు కాపీరైట్ వెలుపల లేదా కాపీరైట్ కాని విషయాలను మరికొందరు కాపీరైట్‌ను ఉల్లంఘించని అనుకరణ చేయడం ఇది స్పష్టంగా జనాదరణ పొందిన అంశాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ తరంలో, కామెడీయేతర అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పేరడీ చిత్రం ఉదాహరణ కాపీరైట్‌ను కలిగి ఉంది. యపేరడీని ముందుగా ఉన్న, కాపీరైట్ చేసిన పని ఉత్పన్న రచనగా పరిగణించగలిగినప్పటికీ, కొన్ని దేశాలు పేరడీలు సరసమైన వ్యవహారం వంటి కాపీరైట్ పరిమితుల క్రిందకు వస్తాయని లేదా లేకపోతే వారి పరిధిలో అనుకరణను కలిగి ఉన్న సరసమైన వ్యవహార చట్టాలను కలిగి ఉన్నాయని తీర్పు ఇచ్చాయి.
ఏ అంశం అయితే ప్రధాన పేరడీకి ఉపయోగిస్తున్నారు వారి నుండి కాపీరైట్ ఉండాలి అని కొందరు వాదిస్తే కాపీరైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని మరికొన్ని వాదిస్తున్నారు. ఈ పేరడీల అంశం మీద కోర్టుకు వెళ్తున్నవారు ఉన్నారు. కేసులు నమోదు అవుతున్న సందర్భాలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అయితే పేరడీ సన్నీవేశాలను, సాంగ్స్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి రెండు సీన్స్ కాకుండా.. బాహుబలి, మగధీరా, జాంబీరెడ్డి, ఈగ, అరుంధతి, చంద్రముఖి, ఇందుమతి, కాంచన, వంటి చిత్రాలను పేరడీ చేయాలని కోరుతున్నారు. కొత్త వారితో ఆయా చిత్రాలలోని వేషధారణలు వేసి ఓకే సినిమాగా లేదా కనీసం వెబ్ సిరీస్‌లుగా తీసుకురావాలని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చరిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలు, పౌరాణికాలను పక్కన పెట్టి..జానపద, సాంఘిక చిత్రాతో టాలీవుడ్ లో మరిన్ని కొత్త ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నారు. అయితే తెలుగులో కాంచన, ఈగ ఇలా కామెడీ వర్షన్ లో పేరడీలు చేసి చూపిస్తే ప్రజలు ఆదరిస్తారా? అనే ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. అయితే ప్రేక్షకులు ఎప్పుడూ ప్రయోగాలు ఆదరిస్తారని జాంబీ జోనర్ చిత్రాలే నిరుపించాయి.