కమెడియన్ గా కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ హీరోగా ఒక భాద్యతాయుతమైన మంచి పాత్రలో హీరోగా కనిపిస్తున్న చిత్రం ధర్మస్థలి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ కమర్షియల్ విలువల తెలిసిన రమణ మోగిలి దర్శకుడు. పావని హీరోయిన్ గా శంకర్ కి జోడిగా నటిస్తుంది. వినోద్ యాజమాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి ధర్మస్థలి అని టైటిల్ ని ఖరారు చేశాము. ఈ టైటిల్ వెనక కథ సమాజం లో జరిగే విషం లాంటి ఒక విషయాన్ని అందరికి అర్ధమయ్యేలా దర్శకుడు రమణ మోగిలి తెరకెక్కిస్తున్నారు. ఎంటర్‌టైన్ చేస్తూనే ఈ విషయాన్ని అందరి అర్దమయ్యేలా వుంటుంది అందుకే ఈ ధర్మస్థలి టైటిల్ కి ఖరారు చేశారు.
ఈ సందర్బంగా దర్శకుడు రమణ మోగిలి మాట్లాడుతూ.. షకలక శంకర్ తో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవరూ తెరకెక్కించలేదు. ఆయనలో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయనలో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్దమవుతుంది. ప్రతిరోజు మన జీవితాలతో ముడి పడిన ఓ విషయాన్ని అలాగే మన జీవితాలతో ఆడుకుంటున్న అంశాన్ని ఆయన పాత్ర ద్వారా తెలియజేస్తున్నాం. ఆయనలో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటి ని తెరపైకి తీసువస్తున్నాం. శంకర్ కి జోడి గాద పావని నటిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్.. అకుతోట సంజు మాట్లాడుతూ పక్కా మాస్ కమర్షియల్ చిత్రం గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఈ చిత్రం లో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి దర్శస్థలి అనే టైటిల్ ని ఖరారు చేశాము. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయగానే భారి బడ్జెట్ చిత్రాలకి వచ్చిన రెస్పాన్స్ రావటం విశేషం. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తాము ఈరోజు ఈ చిత్రం యెక్క మెదటి లుక్ ని విడుదల చేశాము అన్నారు. నటీనటులు శంకర్, పావని, మని భట్టాచార్య, సన్ని సింగ్, షియాజి షిండే, ధనరాజ్, భూపాల్, భరత్, ఛత్రపతి శేఖర్, ముక్తార్, ఉన్ని కృష్ణ, ఘని, విజయ్ భాస్కర్, మాధవి, హసిని, రమ్య,స్వాతి తదితరులు.