Aryan Khan: జైలు నుంచి విడుదలైన ఆర్యన్ ఖాన్
* అక్టోబర్ 3న డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ * 28 రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఆర్యన్
Aryan Khan: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ముంబై కోర్టు. దీంతో నాలుగు వారాల పాటు ఆర్ధర్ రోడ్ జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై విడుదలయ్యాడు.
ఆర్యన్‌కు గురువారమే బెయిల్ మంజూరు చేసినప్పటికీ ప్రక్రియ పూర్తి కావడంలో ఆలస్యం జరగడంతో ఆర్యన్ ఖాన్ విడుదల ఆలస్యం అయింది. కొడుకుని ఇంటికి తీసుకెళ్లేందుకు షారుఖ్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలుకు వచ్చారు. ఈ కేసులో అరెస్టయిన 28 రోజుల తర్వాత ఆర్యన్ తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు.
డ్రగ్స్ కేసులో అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ అక్టోబరు 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ఆ మరుసటి రోజు ఆర్యన్‌ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం ఆర్యన్ దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక న్యాయస్థానం అందుకు తిరస్కరించింది.
దీంతో ఆర్యన్ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 26న ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ మొదలుపెట్టింది. ఆర్యన్ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం. ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. అతడితో పాటు అర్బాన్ ఖాన్, మున్మున్‌కు బెయిల్ ఇచ్చింది.