టాలీవుడ్ కి సెప్టెంబర్ 25 బ్లాక్ డే!
Black Day For Tollywood : సెప్టెంబర్ 25 టాలీవుడ్ కి నిజంగా బ్లాక్ డే అనే చెప్పాలి.. ఇదే రోజు తెలుగు ఇండస్ట్రీకి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.. గత ఏడాది (2019 సెప్టెంబర్ 25) ఇదే రోజున టాలీవుడ్ టాప్ కమెడియన్ వేణుమాధవ్ మృతి చెందారు..
Black Day For Tollywood : సెప్టెంబర్ 25 టాలీవుడ్ కి నిజంగా బ్లాక్ డే అనే చెప్పాలి.. ఇదే రోజు తెలుగు ఇండస్ట్రీకి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.. గత ఏడాది (2019 సెప్టెంబర్ 25) ఇదే రోజున టాలీవుడ్ టాప్ కమెడియన్ వేణుమాధవ్ మృతి చెందారు.. ఇక ఈ ఏడాది (2020 సెప్టెంబర్ 25)న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. ఇందులో ఒకరు తమదైన కామెడీతో అలరిస్తే మరొకరు తన గాత్రంతో ప్రపంచాన్నే పరవశింపజేశారు. ఈ ఘటనలు యాదృచ్చికమే అయినప్పటికీ సెప్టెంబర్ 25 టాలీవుడ్ కి నిజంగా బ్లాక్ డే గా మిగిలిపోయింది.
అనారోగ్యంతో బాధపడుతూ హాస్యనటుడు వేణుమాధవ్ గత ఏడాది సెప్టెంబర్ 25 న సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మృతి చెందారు. వైవిధ్యమైన పాత్రలతో తెలుగుచిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సంప్రదాయం' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు వేణుమాధవ్.. అ తర్వాత తొలిప్రేమ, దిల్, సై, లక్ష్మి లాంటి సినిమాలు వేణుమాధవ్ ని స్టార్ కమెడియన్ ని చేసాయి. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు మిమిక్రి ఆర్టిస్ట్ గా పనిచేసారు.. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటును మిగిల్చింది.
ఇక ఇటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో ఆగస్టు 4 న చెన్నైలోని MGM ఆసుపత్రిలో చేరారు.. అక్కడ అయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ అయన ఆరోగ్య స్థితిలో మార్పు రాలేదు.. ఈ క్రమంలో అయన శుక్రవారం కన్నుమూశారు. దాదాపుగా పడుకొండు భాషలలో నలబై వేలకి పైగా పాటలు పాడారు ఎస్పీ బాలు.. అయన మరణం భారతీయ సినిమాకే తీరని లోటని చెప్పాలి.