Aamani: క్యాస్టింగ్ కౌచ్‏పై ఆమని షాకింగ్ కామెంట్స్.. ఒంటరిగా...

Aamani: క్యాస్టింగ్ కౌచ్‏పై ఆమని షాకింగ్ కామెంట్స్.. ఒంటరిగా...

Update: 2023-02-24 05:09 GMT

Aamani: క్యాస్టింగ్ కౌచ్‏పై ఆమని షాకింగ్ కామెంట్స్.. ఒంటరిగా...

Aamani: సీనియర్ యాక్ట్రెస్ ఆమని గురించి తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఆమని, ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమని ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. తనకి సినిమాలంటే చాలా ఇష్టం అని, ఒక నటిగా కొనసాగాలి అనే తన ఆసక్తిని ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని కేవలం తన హార్డ్ వర్క్ కారణంగానే ఇప్పుడు తను ఈ స్టేజికి వచ్చానని చెప్పుకొచ్చారు ఆమని. అంటే ఇండస్ట్రీకి వచ్చినా కొత్తల్లో ఆమెని కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.

వాటి గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేశారు ఆమని. "నేను ఆడిషన్స్ కోసం చాలా కంపెనీలు తిరిగే దాన్ని. కొంతమంది యాక్సెప్ట్ చేశారు మరి కొంతమంది రిజెక్ట్ చేశారు. కొంతమంది మాత్రం ఆఫీసులో చాలాసేపు వెయిట్ చేయించుకొని ఆ తర్వాత పిలిచే వారు. అప్పుడు వారు ఎందుకలా చేస్తున్నారు నాకు అర్థం అయ్యేది కాదు. కానీ ఆ తర్వాత వారు ఎందుకలా చేశారు అర్థమైంది. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్ లుక్ టెస్ట్ కోసం పిలుస్తున్నారు అని ప్రొడక్షన్ యూనిట్ నుండి ఫోన్ కాల్స్ వచ్చేవి. అప్పుడు నేను మా అమ్మతో వచ్చేదాన్ని కానీ వాళ్లు నన్ను ఒక్కదాన్నే రమ్మనే వాళ్ళు. కానీ నేను ఎప్పుడూ ఒక్కదాన్నే వెళ్లేదాన్ని కాదు. ఇలా చాలా అవకాశాలు కూడా కోల్పోయాను. అందువల్లే ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి నాకు రెండేళ్లు పట్టింది," అని అన్నారు ఆమని.

Tags:    

Similar News