Chandra Mohan: ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!
Chandra Mohan: ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు.
Chandra Mohan: ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 82 ఏళ్లు. చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు.
హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉంది. అది నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించినవారే.
932 పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్.. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాల్లో అతడి నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి.