కంగన, రంగోలికి పోలీసుల నుంచి మూడోసారి సమన్లు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తో పాటు ఆమె సోదరి రంగోలీ చాందల్‌కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఉద్రిక్తతలు పెంచేలా మత సంబంధిత అంశాలపై సామాజిక మాధ్యమాల్లో వారిద్దరు చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు పంపారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తో పాటు ఆమె సోదరి రంగోలీ చాందల్‌కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఉద్రిక్తతలు పెంచేలా మత సంబంధిత అంశాలపై సామాజిక మాధ్యమాల్లో వారిద్దరు చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు పంపారు. నవంబరు 23న కంగన రనౌత్, నవంబరు 24న రంగోలీ బంద్రా పోలీసు స్టేషన్‌లో తమ ముందు హాజరై వాటిపై సమాధానం చెప్పాలని పోలీసులు ఆదేశించారు.
కంగన రనౌత్, రంగోలీకి ముంబై పోలీసులు సమన్లు పంపడం ఇది మూడోసారి. అక్టోబరు 26, 27 తేదీల్లో ఓసారి, నవంబరు 9, 10 తేదీల్లో మరోసారి హాజరుకావాలంటూ పోలీసులు వారిని ఆదేశించగా వారు హాజరుకాలేదు. తాను బిజీగా ఉన్నానని, తమ కుటుంబంలోని ఒకరి పెళ్లి ఉందని, నవంబరు 15 తర్వాత ఫ్రీగా ఉంటానని కంగన అప్పట్లో తెలిపింది. క్యాస్టింగ్ డైరెక్టర్ సాహిల్ అష్రఫ్ అలీ సయ్యద్ అక్టోబర్‌లో ఈ కేసు వేశారు.
కంగనా, రంగోలి ఇంటర్వ్యూలు, ట్వీట్లు సోషల్ మీడియా ద్వారా దేశంలోని పలు సంఘాల మధ్య చిచ్చు పెడుతున్నాయని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని సయ్యద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఐపిసి సెక్షన్లు 153 ఎ (శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 ఎ (మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేసే హానికరమైన చర్యలు) మరియు ఆమె సోదరిపై 124 ఎ (దేశద్రోహం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు.