Surya Kiran: ‘సత్యం’ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత
Surya Kiran: చెన్నై ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందిన సూర్యకిరణ్
Surya Kiran: టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. తెలుగులో సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన సూర్యకిరణ్... తెలుగులో సత్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత ధన 51 బ్రహ్మాస్త్రం, రాజుభాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన అరసి చిత్రానికి ఆయనే దర్శకుడు. హీరోయిన్ కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.