డ్రగ్స్ కేసులో ప్రముఖ యాంకర్‌కు సీసీబీ నోటీసులు?
Sandalwood Drug Case: బాలీవుడ్ తో పాటుగా శాండల్‌వుడ్ లో కూడా డ్రగ్స్ కోణం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. అయితే డ్రగ్స్ కేసులో భాగంగా కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు సీసీబీ అధికారులు గురువారం నోటీసులు ఇచ్చారు.
Sandalwood Drug Case: బాలీవుడ్ తో పాటుగా శాండల్‌వుడ్ లో కూడా డ్రగ్స్ కోణం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. అయితే డ్రగ్స్ కేసులో భాగంగా కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు సీసీబీ అధికారులు గురువారం నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ రవాణా కేసులో భాగంగా సెప్టెంబర్ 19 న కొరియోగ్రాఫర్ కిశోర్‌శెట్టిని మంగళూరు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కిశోర్‌శెట్టి బెంగళూరులో కార్తీక్‌శెట్టి అనే నిందితునితో కలిసి కాలేజీల వద్ద డ్రగ్స్ అమ్మేవాడని తేలింది. అయితే కొరియోగ్రాఫర్ కిశోర్ శెట్టి విచారణలో చెప్పిన సమాచారం ప్రకారం అనుశ్రీకి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
దీనిపై స్పందించిన అనుశ్రీ.. 'దాదాపు 10 ఏళ్ల కిందట కిశోర్‌శెట్టితో కలిసి డ్యాన్స్ చేశా. అతనితో నాకు అంత పరిచయం లేదు. నన్ను అనవసరంగా దీనిలో భాగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు' అని ఆరోపించింది. అంతేకాకుండా మంగుళూరు సీసీబీ నుండి తనకి ఎలాంటి నోటీసు రాలేదని, ఇలాంటి వార్తలతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు. మంగళూరుకు చెందిన అనుశ్రీ టీవీ యాంకర్‌గా కొనసాగుతూనే పలు సినిమాల్లోనూ కూడా నటిస్తూ వస్తోంది.. కన్నడ టెలివిజన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్ లలో అనుశ్రీ ఒకరు కావడం విశేషం..
అయితే ఈ డ్రగ్స్ కేసును ఐఎస్‌డీ, సీసీబీ విభాగాలు విచారిస్తున్నాయి. రెండు సంస్థల దర్యాప్తు వల్ల గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన అధికారులు మొత్తం కేసును సీసీబీకే అప్పగించాలని నిర్ణయించారు.