Samantha: మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సమంత

*ఈ సినిమాను బ్యానర్ పై సునీత తాటి గారు నిర్మిస్తున్నారు. *ఈ సినిమాలో సమంత ''అను'' అనే పాత్రలో నటించబోతుంది.

Update: 2021-11-26 09:37 GMT

సమంత (ఫైల్ ఫోటో)

Samantha: సమంత నాగచైతన్య ల మధ్య విడాకులు జరిగిన సంగతి తెలిసిందే, సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన కెరీర్ పైనే దృష్టి కొనసాగిస్తున్నది. పట్టుకోండి చూద్దాం అనే అంత వేగంగా వరుస సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే రెండు వేర్వేరు భాషల్లో సినిమాలను అనౌన్స్ చేసింది.

తాజాగా మరో భాష లో ''ది అరెంజ్మెంట్ ఆఫ్ లవ్'' అనే గ్లోబల్ మూవీ ని అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో సమంత ''అను'' అనే పాత్రలో నటించబోతుంది. ''ఓ సరికొత్త ప్రపంచం ''ది అరేంజ్మెంట్ ఆఫ్ లవ్'' లో భాగం కావడాన్ని త్రిల్ గా ఫీల్ అవుతున్నాను, ఈ పాత్రలో చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉంది, అను అనే పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడు పిలిప్ జాను కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అంటూ ట్వీట్ చేసారు. ఈ సినిమా గురు ఫిలిమ్స్ బ్యానర్ పై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకి ఏ సినిమాలో చేయని పాత్రలో సమంత నటించబోతున్నట్టు సమాచారం.


Tags:    

Similar News