Samantha: 'వెనక్కి తగ్గాను.. కానీ ఓడిపోలేదు'..
Samantha: తన ఆరోగ్యం గురించి ఇన్ డైరెక్ట్ గా రిప్లై ఇచ్చిన సమంత
Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గురించిన పోస్టులను చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ గత కొంత కాలంగా ఈమె సోషల్ మీడియా చాలా ఖాళీ ఖాళీగా కనిపిస్తోంది. ఎప్పుడో తప్ప సమంత పోస్టులు కూడా చేయడం లేదు. మీడియా ముందు కూడా సమంత కనిపించకపోవడంతో సమంత ఆరోగ్యం బాగాలేదని అందుకే కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉండడానికి నిర్ణయించుకుందని ఎన్నో పుకార్లు బయటకు వస్తున్నాయి. తాజాగా ఒక సోషల్ మీడియా పోస్ట్టి కి గట్టిగానే జవాబు ఇచ్చింది సామ్.
"డౌన్ బట్ నాట్ అవుట్" అంటూ తన పెంపుడు కుక్క ఫోటోని పెట్టింది సమంత. తన క్యాప్షన్ ద్వారా అనారోగ్యంగా ఉంది కానీ పూర్తిగా సినిమాలలో నుంచి బయటకు వెళ్లిపోవడం లేదు అంటూ గట్టిగానే క్లారిటీ ఇచ్చింది. ఫోటో చూస్తే సమంత ఇంకా తన ఇంట్లోనే ఉందని తెలుస్తోంది. సినిమాల పరంగా చూస్తే సమంత శాకుంతలం మరియు యశోద సినిమాలతో త్వరలో ప్రేక్షకుల మందికి రాబోతోంది. విజయ్ దేవరకొండ తో కలిసి నిన్ను కోరి ఫేమ్ డైరెక్టర్ శివ నిర్వాణా దర్శకత్వంలో "ఖుషి" అనే సినిమాతో కూడా బిజీగా ఉంది సమంత. మాల్దీవ్స్ వెకేషన్ పూర్తి చేసుకుని విజయ్ దేవరకొండ తిరిగి హైదరాబాద్ రాగానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ పట్టాలెక్కనుంది.