Samantha: వాళ్లు చివరకు సర్వనాశనం అవుతారు
Samantha: పదేళ్ల స్నేహం.. నాలుగేళ్ల వివాహ బంధం అంతకుమించి టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ అలాంటి శామ్-చై హఠాత్తుగా ఇంతపెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారు.?
Samantha: పదేళ్ల స్నేహం.. నాలుగేళ్ల వివాహ బంధం అంతకుమించి టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ అలాంటి శామ్-చై హఠాత్తుగా ఇంతపెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారు.? తమ అభిమాన నటుడు, నటి ఎందుకు వివాహ బంధానికి ముగింపు పలికారు.? వెండితెరపై సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ కపుల్ పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎందుకు సక్సెస్ కాలేకపోయారు.? ఇప్పుడు అందరిలోనూ ఇవే ప్రశ్నలు.
సూపర్ డీలక్స్.. ఫ్యామిలీమెన్-2 సమంత-చైతన్య విడాకులతో ఈ రెండు సినిమాలపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం వీటిలో సమంత చేసిన బోల్డ్ క్యారెక్టర్లే.! ఈ రెండు పాత్రలు అభిమానులను షాక్ గురిచేశాయి. వీటికితోడు సమంతా డ్రెస్సింగ్ స్టైల్పైనా గతంలో అంతులేనంత చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తన స్నేహితులు. పర్సనల్ మేకప్ ఆర్టిస్టుతో కలసి సమంత దిగిన ఫొటోలు సంచలనం కలిగించాయి. వీటన్నింటికీ తోడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంపైనా గతంలో చైతన్య సెటైర్లు వేశాడు.
ఏ రంగం కూడా వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు కలిగించదు. కానీ రంగుల ప్రపంచం మాత్రం ఇందుకు భిన్నమనే చెప్పాలి. నచ్చిన పాత్రలు, చేయాలనుకున్న సినిమాలు ఇలా ఏ ఒక్కటీ ఒకదానికొకటి పొంతన కూడా ఉండదు. ఇలాంటి అంశాలే శామ్-చై వివాహబంధం బ్రేక్ కావడానికి కారణాలుగా నిలిచాయా అన్న సందేహాలే అందరిలోనూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పుడూ కామ్ అండ్ కూల్‌గా కనిపించే నాగచైతన్య సినిమా ప్రపంచానికి యాప్ట్‌గా కనిపించే సమంతలు ఒక్కటైనా ఇప్పుడు అవే రీజన్స్ వీళ్ల రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణాలయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే బాలీవుడ్‌పై సమంతా ఫోకస్ చేస్తున్న వార్తలూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక్క ఛాన్స్ అనేందుకు ముంబైకి మకాం మార్చాలనే ప్లాన్‌లో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి చైతన్యతో వివాహం తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతుందన్న ఫ్యాన్స్‌కు సమంత తన బోల్డ్ క్యారెక్టర్లతో షాకిచ్చింది. పెళ్లికి ముందు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన శామ్ వివాహం తర్వాత మాత్రం విభిన్న పాత్రలతో ఆకట్టుకోవాలనుకుంది. దీంతో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ మంచి పేరు తెచ్చుకొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ డీలక్స్ చేసింది. అయితే, ఆ బోల్డ్ క్యారెక్టర్‌పై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయినప్పటికీ శామ్ వెనక్కు తగ్గలేదు. ఫ్యామిలీమెన్-2 సిరీస్‌లో సూపర్ డీలక్స్‌కు మించిన బోల్డ్ క్యారెక్టర్‌తో మళ్లీ షాకిచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీమెన్-2లో సమంత చేసిన ఇంటిమేట్ సీన్లపై అక్కినేని ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఇక విడిపోతున్నాం అని ప్రకటించే కొన్ని గంటల ముందు సమంతా చేసిన ఇన్‌స్టా స్టోరీ ఇప్పుడు వైరలవుతోంది. తల్లిగర్భం మీద లవ్ సింబల్‌తో పోస్ట్ చేసిన శామ్ తాను బాధలో ఉన్నప్పుడు ఒక విషయం అర్ధమైందంటూ రాసుకొచ్చింది. చివరకు ప్రేమే గెలుస్తుందనేది చారిత్రాత్మక సత్యం అని, కొందరు ద్రోహులు, దుర్మార్గులు, నియంతలు వెన్నుపోటు పొడుస్తారు, కుట్రలు చేస్తారని రాసుకొచ్చింది. అలాంటి వాళ్లు చివరకు సర్వ నాశనం అవుతారంటూ భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది.
ఇదే సమయంలో చైతన్య-సమంత విడాకులపై అక్కినేని నాగార్జన స్పందించారు. ట్విట్టర్ వేదికగా సమంత-చైతన్యలు విడిపోవడం దురదృష్టకరం అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వాళ్ల వ్యక్తిగతం అన్న నాగ్ శామ్-చైతు ఇద్దరూ తన గుండెల్లో ఉంటారన్నారు.
మరోవైపు నాగచైతన్య-సమంత విడాకులపై కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు. పెళ్లిళ్లు కాదు విడాకులను వేడుక చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. వివాహం చావుతో సమానమన్న రామ్ గోపాల్ వర్మ విడాకులు పునర్జన్మ లాంటివని ట్వీట్ చేశారు.