Sai Dharam Tej: యువరానర్.. అసలైన రిపబ్లిక్ అప్పుడే.. రిపబ్లిక్ మోషన్ పోస్టర్ రిలీజ్
దేవకట్టా దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ పొలిటికల్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
దేవకట్టా దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో ఓ పొలిటికల్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ సినిమా టైటిల్‌ను ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'రిపబ్లిక్ ఇన్ టు పబ్లిక్' అంటూ ప్రకటిచారు. ఈ మూవీని వేసవిలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
ముఖ్యంగా సాయి తేజ్ వాయిస్ ఓవర్ ఈ మోషన్ పోస్టర్‌కు ప్రధానాకర్షణగా నిలిచింది. 'యువరానర్..ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్' అంటూ చెప్పే డైలగ్ అదిరిపోయింది.