Ram Pothineni: వ్యాపారవేత్త కుమార్తెతో రామ్‌ పెళ్లి?

Ram Pothineni: లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ తర్వాత ఏడడుగులు నడిచే పనిలో ఉన్నాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.

Update: 2023-06-17 15:00 GMT

Ram Pothineni: వ్యాపారవేత్త కుమార్తెతో రామ్‌ పెళ్లి?

Ram Pothineni: లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ తర్వాత ఏడడుగులు నడిచే పనిలో ఉన్నాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ఆల్రెడీ ముహుర్తాలు కుదిరాయి. దసరా కంటే ముందే ఈ ఇద్దరి ఇంట్లో వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయనే మాటే వినిపిస్తోంది. ఇలా మొదలైన పెళ్లిగోల టాలీవుడ్ లో ఇంకా కంటిన్యూ అయ్యేలా ఉంది. రీసెంట్ గా శర్వానంద్ బిజినెస్ మెన్ కూతురితో ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. సింగిల్ స్టేటస్ నుంచి బయట పడ్డాడు. ఇప్పుడు అదే దారిలో పావుడజన్ హీరోలు బిజీ అవ్వబోతున్నారట.

శర్వానంద్ తర్వాత వరుణ్ తేజ్ ఇంట్లో కూడా పెళ్లిగోల పెరగబోతోందనుకుంటే, ఈలోపు సీన్ లోకి రామ్ పేరు వచ్చింది. ఈ ఇస్మార్ట్ హీరో కూడా ఓ ఇంటివాడయ్యే టైం వచ్చిందట. అమ్మాయి కూడా దొరికేసిందని, ఇక ఎంగేజ్ మెంట్ కి ముహుర్తాలే ఆలస్యం అంటున్నారు. గతంలోనే రామ్ ఓ ఇంటివాడవ్వబోతున్నాడని గుసగుసలొచ్చాయి. కాని అవేవి నిజం కాలేదు. కాని బోయపాటి శీను మూవీ తర్వాత రామ్ ఓ ఇంటివాడవ్వటం కన్పామ్ అంటున్నారు. బిజినెస్ మ్యాన్ కూతురితోనే రామ్ పెళ్లి అన ప్రచారం కూడా పెంచారు.

ఇక మెగా హీరోల్లో సాయితేజ్ పెళ్లి మీద కూడా గుసగుసలు పెరిగాయి. 2024 సమ్మర్ లో సాయితేజ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని ప్రచారం జరగుతోంది. వరున్ తేజ్ తర్వాత మెగా హీరోల్లో సాయితేజే పెళ్లి జరగటం ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యిందట. మ్యాచ్ కూడా కుదిరిందని తెలుస్తోంది.

Tags:    

Similar News