Ram Pothineni: రామ్ సినిమా పై వినిపిస్తున్న పుకార్లు

Ram Movie: *రామ్ సినిమా విషయంలో వినిపిస్తున్న ప్రచారం

Update: 2022-06-28 11:30 GMT
Rumors circulating on Ram movie

రామ్ సినిమా పై వినిపిస్తున్న పుకార్లు

  • whatsapp icon

Ram Movie: ఈ మధ్యనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో రామ్ పోతినేని తాజాగా ఇప్పుడు తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో "ది వారియర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా నటించిన "అఖండ" సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను రామ్ కోసం ఒక అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే గత కొన్ని వారాలుగా ఈ సినిమా గురించి రెండు పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ఈ సినిమాలో తమిళ స్టార్ శివ కార్తికేయన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెండవది ఈ సినిమాలో రామ్ పాత్ర నందమూరి బాలకృష్ణకి డై హార్డ్ ఫ్యాన్ గా కనిపించనున్నారని మరికొందరు చెబుతున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు పుకార్ల లోనూ ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News