RRR Movie: ఆడియో హక్కులకు 25 కోట్లు.. ఆగష్టు 1న మొదటి పాట రిలీజ్

Update: 2021-07-27 05:53 GMT

"ఆర్ఆర్ఆర్" పోస్టర్ 

RRR Movie: ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్తను చిత్ర యూనిట్ విడుదల చేసింది. "ఆర్ఆర్ఆర్" చిత్రానికి సంబంధించిన సంగీతాన్ని 5 భాషల్లో 5 మంది సూపర్ సింగర్స్ తో "ఆర్ఆర్ఆర్" సినిమా థీమ్ సాంగ్ పై ఒక మ్యూజిక్ వీడియోని ఎంఎం కీరవాణి నేతృత్వంలో రూపొందించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా రాజమౌళి ట్విట్టర్ వేదికగా ఈ సినిమాలోని మొదటి పాటని ఆగష్టు 1న స్నేహితుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలిపాడు.  ఇక ఈ సినిమాకి సంబంధించిన అయిదు భాషల్లో ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ తో పాటు టి సిరీస్ సంయుక్తంగా 25 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

దక్షిణాది సినిమా చరిత్రలోనే కాకుండా భారత సినీ చరిత్రలో ఒక సినిమా ఆడియోకి 25కోట్లకు అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన "సాహో" చిత్ర ఆడియో హక్కులకు 22 కోట్లు, "బాహుబలి-2" చిత్రానికి 10 కోట్లు, "సైరా నరసింహ రెడ్డి" చిత్రానికి 10 కోట్లు, ఇక తాజాగా యష్ హీరోగా నటించిన "కేజీఎఫ్-2" చిత్ర ఆడియోలకి 7.2 కోట్లు పలికినట్టు తెలుస్తుంది. ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల చేయడానికి "ఆర్ఆర్ఆర్" చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News