Alia Bhatt: ఆలియా భట్‌కు కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్
Alia Bhatt: దేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది.
Alia Bhatt: దేశంలో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ కరోనా బరిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఆలియా భట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తోంది. ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోంది. కరోనా సోకిన విషయాన్ని అలియా భట్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు తెలిపింది. అయితే వైద్యుల సలహా మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది. వైద్యుల సలహా మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ మరోసారి టెన్షన్ పడుతోంది.
ప్రస్తుతం RRR సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. గతంలో కరోనా కరోనా కారణంగా ఓ ఎనిమిది నెలలు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మరోసారి వాయిదా పడింది. ఆక్టోబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తేదీని కూడా ప్రకటించారు. తాజాగా అలియా భట్ కరోనా సోకడంతో ఆర్ఆర్ఆర్ బృదం తెగ హైరానా పడిపోతుంది. ఆలియా సిన్స్ షూట్ కంప్లీట్ అయితే ఓకే లేకుంటే మరోసారి వాయిదా పడుతుందని అభిమానులు అందోళనకు గురవుతున్నారు. అలియా త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆలియా భట్, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తోన్న 'గంగూబాయ్' సినిమాలో నటిస్తోంది. ఇక గతంలో ఆమె బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్‌కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే..రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణీ సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియా శరన్, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్, సముద్రఖని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిపంచనున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకున్నట్టుగా ప్రకటించింది ఆర్ఆర్ఆర్ టీమ్.