Alia Bhatt: అలియా భట్‌కి ముంబై కోర్టు నోటీసులు
Alia Bhatt: ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్‌కి ముంబై హైకోర్టు నోటీసులు పంపింది.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌కి షాక్ తగిలింది. ఈ నటికి ముంబయి కోర్టు నోటీసులు పంపింది. మే 21 లోపు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ఇద్దరు రచయితలకు ఈ నోటీసులు అందాయి. వివరాల్లోకి వెళ్తే.. అలియా భట్‌తో సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయ్ కథైవాడి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మేడమ్ ఆఫ్ కామతిపుర(ముంబయిలోని రెడ్ లైట్ ఏరియా)గా పేరొందిన గంగుబాయ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో అలియా భట్ సెక్స్ వర్కర్‌గా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ఆ మధ్యన విడుదల కాగా..అందరినీ ఆకట్టుకుంది.
కాగా ఈ ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు కథైవాడ్ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ గంగూబాయ్ దత్తత కుమారుడిగా చెప్పుకునే బాబు రాజీవ్ షా అలియా భట్, సంజయ్ లీలా భన్సాలీపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ క్రమంలో సంజయ్ లాలా భన్సాలీ, అలియా భట్, ఇద్దరు రచయితలకు సమన్లు జారీ చేశారు. తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్లరు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో రావ్జీ సవివరంగా తెలిపారని, వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణించలేనిదని వ్యాఖ్యానించింది. ఈ సినిమాను హాసన్ జైదీ రచించిన మాఫీనా క్వీన్స్ ఆఫ్ ముంబయి పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.