ఏపీ ప్రభుత్వ పెద్దల ప్రతిపాదన మేరకు తగ్గిన భీమ్లా? డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు రంగంలోకి రాజమౌళి
Bheemla Nayak: ఏపీలో సినీ, రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వర్సెస్ జగన్ అంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Bheemla Nayak: ఏపీలో సినీ, రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వర్సెస్ జగన్ అంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన మీద కోపంతోనె ఏపీ సీఎం జగన్ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారని డైరెక్ట్ ఎటాక్ చేశారు పవన్. అవసరమైతే తన భీమ్లా నాయక్ సినిమాను ఫ్రీగా చూపిస్తానంటూ పవన్ చేసిన ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో పవన్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
కొత్త సంవత్సరంలో సంక్రాంతి బరిలో పవన్‌కల్యాణ్ బీమ్లా నాయక్ విడుదలవుతుందని ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే క్రేజీ సినిమాల్లో బీమ్లానాయక్ ఒకటి. అయితే పాన్ ఇండియా సినిమాలైన ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ సినిమాల కోసం బీమ్లానాయక్ విడుదలను వాయిదా వేయటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. నిజానికి బీమ్లా నాయక్‌ను సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని పవన్ పట్టుబట్టారు. ట్రిపుల్ ఆర్ కోసం, బీమ్లా రిలీజ్‌ను వాయిదా వేయాలని రాజమౌళి రిక్వెస్ట్ చేసినా పవన్ వెనక్కి తగ్గలేదన్న మాటలు వినిపించాయి. కాని ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్. నిర్మాత దానయ్య నేరుగా దర్శకుడు త్రివిక్రమ్‌ను కలిసారు. అలాగే పవన్ అపాయింట్ మెంట్ కోసం కూడా ట్రయ్ చేసారు. రాజమౌళి నేరుగా త్రివిక్రమ్‌తో టచ్‌లోకి వెళ్లిన అనంతరం సినిమా వాయిదా పడింది. ఇది ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునే మాట.
నిజానికి బీమ్లా నాయక్ విడుదల వాయిదా పడటం వెనుక అసలు కారణం మాత్రం వేరే ఉందనే చర్చ సాగుతోంది. సంక్రాంతికి విడుదలవుతోన్న మిగతా సినిమాల టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలకు సానుకూలంగా ప్రభుత్వం వ్యవహరించాలంటే బీమ్లానాయక్ విడుదల ఉండకూడదంటూ ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన వచ్చిందని వినికిడి. ఈ విషయమై, సినీ ప్రముఖలు పవన్‌ను నేరుగా కలిసి పరిస్థితిని వివరించటం, పవన్ అందరి సినిమాలను దృష్టిలో ఉంచుకుని, తన సినిమా విషయంలో వెనక్కి తగ్గారని అంటున్నారు. అయితే పవన్ భీమ్లానాయక్ వెనక్కి వెళ్లటం పట్ల ఇతర సినిమాల దర్శక నిర్మాతలు సంతోషంగా ఉన్నా, ఆయన అభిమానులు మాత్రం నిరాశకు గురయ్యారు. నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టి బీమ్లా నాయక్ విడుదల వాయిదా విషయమై, అభిమానులు అర్దం చేసుకొవాల్సిందిగా కోరారు.
పవన్ అభిమానుల నిరాశను కాస్తో కూస్తో తగ్గించేందుకు రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగారు. పవర్ స్టార్, సూపర్ స్టార్‌లు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు, ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పారు. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇదే మాదిరి ట్వీట్‌లతో అభిమానులను కూల్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.