Flop Movie: బాలీవుడ్‌ చరిత్రలో అట్టర్‌ఫ్లాప్‌ మూవీ.. హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ కొంపముంచిందా..?

Flop Movie: కంటెంట్‌ ఉండాలే కానీ బడ్జెట్‌తో పనిలేదని ఎన్నో చిన్న సినిమాలు నిరూపించాయి. మంచి కథతో వచ్చి కోట్లు కొల్లగొట్టిన మూవీస్‌ ఉన్నాయి.

Update: 2024-11-05 08:41 GMT

Flop Movie: బాలీవుడ్‌ చరిత్రలో అట్టర్‌ఫ్లాప్‌ మూవీ.. హీరోయిన్ల మధ్య రొమాన్స్‌ కొంపముంచిందా..?

Flop Movie: కంటెంట్‌ ఉండాలే కానీ బడ్జెట్‌తో పనిలేదని ఎన్నో చిన్న సినిమాలు నిరూపించాయి. మంచి కథతో వచ్చి కోట్లు కొల్లగొట్టిన మూవీస్‌ ఉన్నాయి. అయితే అదే సమయంలో ఎంత ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినా కథా, కథనం బాగాలేకపోతే అంత వృధానే అని నిరూపించిన సినిమాలు సైతం ఉన్నాయి. ఇలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా బడ్జెట్‌లో కేవలం 20 శాతం మాత్రమే రాబట్టిందా మూవీ. ఇతకీ ఆ సినిమా ఏంటనేగా.. రజియా సుల్తాన్‌. 40 ఏళ్ల కిత్రం తెరకెక్కిన ఈ సినిమాకు అప్పుడే ఏకంగా 10 కోట్ల బడ్జెట్‌ కావడం విశేషం. అప్పట్లో దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కిందీ మూవీ. రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే.. కేవలం రూ. 2 కోట్లు మాత్రమే రిటర్న్‌ వచ్చాయి. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆ సింహాసనంపై కూర్చొన్న ఏకైక మహిళ రజియా సుల్తానా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

కమల్ అమ్రోహి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హేమా మాలిని, ధర్మేంద్ర ఇందులో నటించారు. ఈ సినిమాను ఏకంగా 8 ఏళ్లపాటు నిర్మించారు. ఇంత బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన వాటిలో ఉర్దూ భాష నాసిరకంగా ఉండడం, ఓ పాటలో ఇద్దరు ఫిమేల్ యాక్టర్స్ మధ్య రొమాన్స్ చూపించడం కారణమని చెబుతుంటారు.

దీంతో ఈ సినిమా పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షించలేకపోయిందని చెబుతుంటారు. దీంతో ఈ సినిమా అట్లర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. రజియా సుల్తాన్ సినిమా తీయడానికి కమల్ అమ్రోహి భారీగా అప్పు చేశాడు. ఆ సమయంలో ఎంతో మంది ఫైనాన్షియర్లు ఇందులో పెట్టుబడి పెట్టారు. ఈ సినిమా దెబ్బకు చాలా మంది ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవి చూశారు. దీంతొ ఈ సినిమా ఎంతో మందిని అప్పుల్లోకి నెట్టేసిందని వార్తలు వచ్చాయి. దీంతో బాలీవుడ్‌లో భారీ డిజాస్టర్‌గా చవిచూసిన సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

Tags:    

Similar News