Ravi Teja: నిర్మాతగా మారనున్న మాస్ మహారాజా

Ravi Teja: రవితేజ నిర్మాణంలో తమిళ హీరో

Update: 2022-01-08 12:30 GMT

రవితేజ నిర్మాణంలో తమిళ హీరో

Ravi Teja: వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు "క్రాక్" సినిమాతో మంచి విజయాన్ని సాధించారు. ఇక రవితేజ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే 'రావణాసుర', 'ధమాకా', 'టైగర్ నాగేశ్వరరావు', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "ఖిలాడి" సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మరోవైపు "రావణాసుర" సినిమాలో రవితేజ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్ని విభిన్న పాత్రలలో కనిపించబోతున్న రవితేజ ఇప్పుడు ఒక నిర్మాతగా కూడా మారబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఒక తమిళ్ యాక్టర్ నటిస్తున్న సినిమాకి రవితేజ నిర్మాతగా మారబోతున్నాడట. తమిళంలో విష్ణు విశాల్ పేరు తెలియని వారు ఉండరు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన "రాక్షసుడు" సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "రాట్సాసన్" సినిమాకి రీమేక్. ఆ సినిమాలో హీరో గా నటించింది విష్ణు విశాల్. "నేర్పారవై", "జీవ" వంటి సూపర్ హిట్ లను ప్రేక్షకులకు అందించిన విష్ణు విశాల్ ఇప్పుడు రవితేజ నిర్మిస్తున్న ఒక సినిమాలో నటించనున్నారు. అయితే ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News