Mr. Bachchan: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టర్ బచ్చన్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ నటన ఆకట్టుకున్నా దర్శకత్వంలో పరంగా మెప్పించలేకపోయిందని అభిప్రాయాలు వెల్లడయ్యాయి.
మాస్ మహారాజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. మిరపకాయ వంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ నటన ఆకట్టుకున్నా దర్శకత్వంలో పరంగా మెప్పించలేకపోయిందని అభిప్రాయాలు వెల్లడయ్యాయి. ఇక ఈ సినిమా ద్వారా భాగ్యశ్రీ బోర్సో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ బ్యూటీ తనదైన నటన, అందంతో ప్రేక్షకులను కట్టి పడేసింది. తొలి సినిమాతోనే కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
ఇక థియేటరల్లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా గురువారం అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇంతకీ సినిమా కథేంటంటే..
మిస్టర్ బచ్చన్ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ క్రమంలోనే ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది.? అనేదే సినిమా కథ.