Ravi Teja Krack Movie: భూమ్ బద్దల్ ఓపెనింగ్స్
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్'.
మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9న ఆలస్యంగా విడుదలైన పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రవితేజా క్రాక్ సినిమాపై విమర్శకులు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. రవితేజా మాస్ మహారాజ్ అని మరోసారి అనిపించుకున్నారు. ఆడియన్స్ కావాల్సిన డోస్ ను వారికి అందించారు. కరోనా మహమ్మారి కారణంగా 9 నెలలు థియేటర్లకు దూరమైన ప్రేక్షకులు 'క్రాక్' ఒక విందు భోజనంలా దొరికింది.
క్రాక్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే, కలెక్షన్ ఎంత అనే విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ, ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఆరు కోట్ల రూపాయల షేర్ వసూలైందని అంటున్నారు. పక్కా లెక్కలు తెలియాల్సి ఉంది. అమెరికాలోనూ కూడా 'క్రాక్' మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రీమియర్లు రద్దయినప్పటికీ తొలిరోజు 31 లొకేషన్స్‌లో 34,600 డాలర్ల గ్రాస్‌ను రాబట్టినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా 25 కోట్లు రూపాయలుపైగా వచ్చాయని తెలుస్తోంది. కాగా, 'క్రాక్' థియేట్రికల్ రైట్స్‌ను రూ.19 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించారు. రవితేజ సరసన హీరోయిన్ గా శ్రుతీ హాసన్ నటిస్తోంది. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ తెలుగు సినిమాలో నటిస్తుంది. నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. తమన్ బాణీలు సమకూర్చారు.