MAA Elections 2021: "మా" పై కీలక వ్యాఖ్యలు చేసిన నటుడు రవిబాబు
MAA Elections 2021: మన క్యారెక్టర్ ఆర్టిస్టులకు వేషాలివ్వకుండా, ఇతర భాషల నుంచి నటులను తెస్తున్నారు -రవిబాబు
MAA Elections 2021: "మా" ఎన్నికల పోరు మరోసారి రసవత్తరంగా మారింది. తాజాగా.. "మా" పై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు రవిబాబు. మన క్యారెక్టర్ ఆర్టిస్టులకు వేషాలివ్వకుండా.. ఇతర భాషల నుంచి నటులను తెచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అలాగే.. హైదరాబాద్‌లో 150 నుంచి 200 మంది కెమెరామెన్లు ఖాళీగా ఉంటున్నారని.. వారిని కాదని ఇతర ప్రాంతాల నుంచి కెమెరామెన్లను తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. అదంతా డబ్బులు పెట్టే నిర్మాతల ఇష్టమని, కానీ.. చివరకు మా అసోసియేషన్‌ను కూడా నడపడం మనకు చేతకాదా..? ఎవరో వచ్చి మనకు నేర్పించాలా..? అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూను లేవనెత్తడం తన ఉద్దేశం కాదన్న రవిబాబు.. సభ్యులు ఒకసారి ఆలోచించాలని కోరారు.