Miheeka Bajaj Wedding Dress : మిహీక పెళ్లి డ్రెస్‌ ధర ఎంతో తెలుసా?

Miheeka Bajaj Wedding Dress : పెళ్లికి వెళ్తే ఏర్పాట్లు ఎలా చేశారు. భోజనాలు ఎలా ఉన్నాయి అని చూస్తారు.. ఇక సెలబ్రిటీల పెళ్లిలో అయితే వధువు,

Update: 2020-08-09 10:15 GMT
Miheeka Bajaj

Miheeka Bajaj Wedding Dress : పెళ్లికి వెళ్తే ఏర్పాట్లు ఎలా చేశారు. భోజనాలు ఎలా ఉన్నాయి అని చూస్తారు.. ఇక సెలబ్రిటీల పెళ్లిలో అయితే వధువు, వరుడుల దుస్తులపైన కూడా ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది.. తాజాగా జరిగిన రానా-మిహీక పెళ్లిలో వధువు మిహీక బంగారు, క్రీమ్‌ రంగు లెహంగాలో మెరిసిపోయింది.. ఆమె దుస్తులు మాత్రమే కాదు దాని ధర కూడా అదిరిపోయింది..ఆమె వేసుకున్న ఈ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేశారు. డ్రెస్‌ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారట.. దీని ఖర్చు అక్షరాల ₹6 లక్షలని తెలుస్తోంది. దీనిని డిజైన్ చేయడానికి వందల గంటల శ్రమే ఉందని తెలుస్తోంది. ఇక హల్దీ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్‌ కు ధర దాదాపుగా ₹2 లక్షల వరకు ఉంటుందని సమాచారం.. ఇక ఈ పెళ్ళికి హాజరైనా హీరోయిన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ₹1.59 లక్షలు అని సమాచారం.




 












ఇక తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి పుల్ స్టాప్ పెట్టి, వివాహ బంధంతో నూత‌న జీవితంలోకి అడుగుపెట్టాడు రానా తన ప్రియురాలు మిహీకా బ‌జాజ్ మెడలో నిన్న (శనివారం) రాత్రి 8.30 నిమిషాలకు వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి రామానాయుడు స్టూడియో వేదికైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. వీరి వివాహం జరగ్గా.. ఇరుకుటుంబాల నుంచి కేవలం 30 మంది మాత్రమే బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి సమంతతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సమంత, నాగచైతన్య‌లు వీరి వివాహవేడుకకు హాజరయ్యారు. రానా- మిహీకాల వివాహన్ని తెలుగు-మార్వారీ సాంప్రదాయాల్లో జరిపించారు.  

Tags:    

Similar News