Rana-Miheeka Wedding : రానా - మిహీకా పెళ్లి: ముస్తాబవుతున్న ఏర్పాట్లు!
Rana-Miheeka Wedding : మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న వారంతా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు,
Rana-Miheeka Wedding : మొన్నటివరకూ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న వారంతా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు, ఇప్పటికే యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ లు ఓ ఇంటివాళ్ళు అయిపోయారు. ఇక మరో రెండు రోజుల్లో రానా కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆగస్టు 8న రానా, మిహీకాల వివాహం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరగనుంది. కరోనా నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు.. . రానా , మిహీకా బజాజ్ ఇంటి వద్ద సంబరాలు మొదలైపోయాయి.
ఇక పెళ్లి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. పెళ్లి కూతురుగా మిహికా బజాజ్ హల్దీ వేడుకలో మెరిసిపోయింది. వివాహానికి ముందు జరిగే ఈ వేడుకలో మిహికా పసుపు-ఆకుపచ్చ లెహంగాలో ఆకర్షణీయంగా నిలిచారు. ప్రత్యేక సీషెల్స్ డిజైనర్ ఆభరణాలతో ఆకట్టుకుంటున్నారు.మరోవైపు రానా ఇంట అచ్చ తెలుగు సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించనున్నారు. రానాను పెళ్లికొడుకుని చేసే కార్యక్రమం దగ్గుబాటి వారి ఇంట వేడుకగా జరగనుంది. ఇక కరోనా సమయంలో జరుగుతున్న పెళ్లి కావడంతో అతిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం వారందరూ ఐసోలేషన్‌లో ఉన్నట్టు రానా తండ్రి, సినీ నిర్మాత సురేష్ వెల్లడించారు.
ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి గతఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఆకట్టుకున్న రానా, ప్రస్తుతం అరణ్య ,విరాటపర్వం సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో అరణ్య విడుదలకి సిద్దంగా ఉండగా, విరాటపర్వం షూటింగ్ చివరిదశలో ఉంది.