రానా, మిహీకాలది 'రోకా' ఫంక్షన్ అంట.. ఇంతకి అదేంటంటే ?
యంగ్ హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే.. ముంబైకి చెందినా మిహీకా బజాజ్ తో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న రానా ఇటివలే తన ప్రేయసి అంటూ సోషల్ మీడియాలో అందరికి తెలియజేశాడు.
యంగ్ హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే.. ముంబైకి చెందిన మిహీకా బజాజ్ తో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న రానా ఇటివలే తన ప్రేయసి అంటూ సోషల్ మీడియాలో అందరికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం 4 గంటలకు రానా, మిహీకాల నిశ్చితార్థం రామానాయుడు స్టూడియోలో జరగనుందని వార్తలు వచ్చాయి. ఆ మరుసటి రోజున రానా కూడా తన ప్రేయసి, కాబోయే భార్య మిహీకా బజాజ్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను కూడా బయటకు వదిలాడు. ఈ ఫోటోల్లో ఇద్దరి సాంప్రదాయ దుస్తుల్లో మెడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉన్నారు.
అయితే ఈ ఫోటోలను చూసిన అందరూ రానా, మిహీకా నిశ్చితార్థం ఫొటోలు అని అనుకున్నారు. కానీ ఇది ఇది నిశ్చితార్థం కాదట. దాని కన్నా ముందే జరిగే 'రోకా' వేడుకనట.. మన తెలుగు వాళ్ళకి రోకా వేడుక అంటే తెలియకపోవచ్చు.. రోకా వేడుక అంటే నార్త్ ఇండియా సంప్రదాయం ప్రకారం పెళ్లిని అధికారికంగా నిశ్చయించుకోవడానికి చేసుకునే వేడుకనట. మిహీకా కుటుంబం ముంబైకి చెందిన వారు అన్న విషయం తెలిసిందే..
వారు ఈ వేడుక కోసం హైదరాబాద్ వచ్చి ఆ సంప్రదాయం ప్రకారం రోకా వేడుకను నిర్వహించారు. వారి సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకలో దగ్గుబాటి కుటుంబ సభ్యులతోపాటు, మిహీకా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, అక్కినేని నాగచైతన్య, సమంత పాల్గొన్నారు.
ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి గతఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఆకట్టుకున్న రానా, ప్రస్తుతం అరణ్య ,విరాటపర్వం సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో అరణ్య విడుదలకి సిద్దంగా ఉండగా, విరాటపర్వం షూటింగ్ చివరిదశలో ఉంది.