RGV: సినిమా టికెట్ ధరలపై ఆర్జీవీ సంచలన కామెంట్స్..
Ramgopal Verma: సినిమా టికెట్ ధరలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు.
Ramgopal Verma: సినిమా టికెట్ ధరలపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. సినిమా టికెట్ ఒకే ధర ఉండాలనటం సరికాదన్నారు. టికెట్ రేట్ నిర్మాతకు ప్రేక్షకుడికి సంబంధించిన అంశమని చెప్పారు. హీరోలు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పడం సరికాదన్నార. హీరోల కోసమే ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు వస్తున్నారని చెప్పారు. బడ్జెట్, ఇతరాత్ర విషయాలు ప్రేక్షకులకు అక్కర్లేదని ఆర్జీవీ తెలిపారు.
తమ ఆర్థిక స్థోమతనుబట్టి ఇష్టమొచ్చిన థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూస్తారని, ప్రభుత్వం ధర తగ్గించినా పెంచినా అది ప్రేక్షకుడి ఇష్టం పై ఆధారపడి ఉంటుందని రాంగోపాల్ వర్మ అన్నారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రాకపోతే నిర్మాతలకు నష్టం వాటిల్లితుందని అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాంగోపాల్ వర్మ అన్నారు. ప్రభుత్వం ఇబ్బందులు పెడితే, మేకర్స్ మంచి ప్రాజెక్టులను తీసెందుకు ఇంట్రెస్ట్ కోల్పోతారని వర్మ తెలిపారు.