"రామం రాఘవం" సినిమా నుంచి "తెలిసిందా నేడు" సాంగ్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ సుకుమార్..!
గురుపూజోత్సవం సందర్బంగా రామం రాఘవం మూవీ నుంచి 'తెలిసిందా నేడు' పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
Ramam Raghavam: స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం "రామం రాఘవం". నటుడు ధనరాజ్ కొరనాని మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
గురుపూజోత్సవం సందర్బంగా ఈ మూవీ నుంచి 'తెలిసిందా నేడు' పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్‌గా సాగే ఈ మెలోడీ సాంగ్ విడుదలైన కొద్దిసేపటిలోనే వైరల్ అవ్వడం విశేషం. తండ్రి కొడుకు మధ్య ఉండే ఎమోషన్‌ను కరెక్ట్‌గా కాప్చర్ చేస్తూ చిత్రీకరించిన ఈ సాంగ్‌ను అరుణ్ చిలువేరు సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్.
రామం రాఘవం సినిమాలోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు, హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న 'రామం రాఘవం' తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది.