RED Movie Twitter Review: రామ్ 'రెడ్' మూవీ ఎలా ఉందంటే
రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల డైరక్షన్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్'.
రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల డైరక్షన్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్'.తమిళ సూపర్ హిట్ చిత్రం తడమ్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చింది. సంక్రాంతి సందర్భంగా రెడ్ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాలో హీరో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. గత ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడి పది నెలల తర్వాత రిలీజ్ అయింది. ఇస్మార్ట్ శంకర్ వంటీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి. రామ్ సరసన నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లగా నటించారు.
స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో రామ్ తన డ్యుయల్ రోల్‌తో ఇరగదీసాడు. చిత్రబృందం మాంచి థ్రిల్లర్ సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇక మణిశర్మ రీరికార్డింగ్ కూడా కేక పెట్టించింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా విడుదల అయింది. ఇప్పటికే ప్రిమియర్స్ షోలు కూడా పడ్డాయి. రెడ్ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మళయాళం, బెంగాళీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్ యాక్టింగ్ ఎలా ఉంది. రామ్ మరో బ్లాక్ బస్టర్‌ను అందుకుంటాడా? హీరోయిన్స్ ఎలా ఆకట్టుకున్నారు. అసలు కథేంటీ.. ఇది ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం ఎలా ఉంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ట్విట్టర్ రివ్వూ చూద్దాం.