Veekshanam: ఆద్యంతం ఆసక్తికరంగా 'వీక్షణం' టీజర్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో..
Veekshanam: రామ్ కార్తీక్, కశ్వి జంటగా.. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వీక్షణం'.
Veekshanam: రామ్ కార్తీక్, కశ్వి జంటగా.. మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వీక్షణం'. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సిమిఆను ఈ నెల 18వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా గురువారం టీజర్‌ను విడుదల చేశారు.
1.42 నిమిషాల నిడివి ఉన్న టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆద్యాంతం ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హారర్, కామెడీని మిక్స్ చేస్తూ తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటోంది. క్రమంగా జరుగుతోన్న హత్యలు, వాటి వెనకాల ఉన్న అసలు కథేంటి.? ఇంతకీ హత్యలను ఎవరు చేస్తున్నారా.? లాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. మరి టీజర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే 18వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే సినిమా టీజర్ విడుదల సందర్భంగా హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. 'మా వీక్షణం మూవీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. మా సినిమా టీమ్ లో సురేష్ కొండేటి గారు జాయిన్ అయ్యాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మూవీ తప్పకుండా అందరికీ రీచ్ అవుతుందని నమ్మకం మొదలైంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మంచి మూవీకి తన సపోర్ట్ అందిస్తారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆయన మా టీజర్ లాంఛ్ కు రావడం సంతోషంగా ఉందని' చెప్పుకొచ్చారు.
సినిమా దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ.. 'నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ చేశాను. ఒకరోజు విక్టరీ వెంకటేష్ గారు ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం. ఆయన చెప్పిన ఆ మాటే మా వీక్షణం సినిమాకు కథా నేపథ్యం. మా చిత్రంలో హీరో ఎప్పుడూ పక్కోడి లైఫ్ లో ఏం జరుగుతుందో చూడాలనే ఉత్సాహంలో ఉంటాడు. ఆ ఉత్సాహం వల్ల అతనికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. మా టీమ్ అంతా కష్టపడి కాకుండా ఇష్టపడి మూవీ కోసం వర్క్ చేశాం. ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన భరద్వాజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం' అని చెప్పుకొచ్చారు.