Ram Gopal Varma Shocking Reaction On Amitabh Bachchan Health: బిగ్ బీ నేను మీ కోసం ప్రార్థించను.. వర్మ షాకింగ్ కామెంట్స్!

Ram Gopal Varma Shocking Reaction On Amitabh Bachchan Health: కరోనా ఎవరిని వదలడం లేదు.. ఇక బాలీవుడ్ నటులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు.తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Update: 2020-07-12 14:33 GMT
Ram Gopal Varma Shocking Reaction On Amitabh Bachchan Health

Ram Gopal Varma Shocking Reaction On Amitabh Bachchan Health: కరోనా ఎవరిని వదలడం లేదు.. ఇక బాలీవుడ్ నటులు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు.తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే.. అయనతో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ , కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆధ్య (అభిషేక్, ఐశ్వర్య దంపతుల కూతురు) కూడా కరోనా సోకింది. మిగిలిన కుటుంబ సభ్యులు.. జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి నివేదికలు మాత్రం నెగటివ్ అని వచ్చాయి. బిగ్ బీ కుటుంబంలో నలుగురికి కరోనా రావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇక అమితాబ్ తో పాటుగా ఆయన కుటుంబం త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అభిమానులతో పాటుగా సెలబ్రిటీలు కోరుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ , చిరంజీవి లాంటి నటులు బిగ్ బీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అమితాబ్ బచ్చన్ కోలుకోవాలని కోరుకోవడం లేదంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

SARKAAAR మీరు కరోనా నుంచి కోలుకుంటారని నాకు తెలుసు. ఎప్పటిలాగే మరింత బలంగా తిరిగి వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అందుకే మీ కోసం నేను ప్రార్ధించను. కరోనా కారణంగా చనిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాను" అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో కూడా వర్మ ఈ వెరైటీ రియాక్షన్ ఇవ్వడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక అమితాబ్ తో వర్మ బాలీవుడ్ లో సర్కార్ మూవీ సిరీస్ లను తెరకెక్కించారు.

బిగ్ బీ ఆరోగ్యం నిలకడ :

కరోనా నిర్ధారణ కావడంతో బిగ్ బీ ముంబైలోని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యం అందిస్తున్న వైద్యులు ఆయనలో తేలికపాటి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా వెల్లడించారు. ఇక అంతకుముందు బిగ్ బీ తనతో గత పదిరోజులుగా దగ్గరగా గడిపిన అందరినీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Tags:    

Similar News