మోదీ కన్నీళ్ల వీడియో: ఆస్కార్ ఇవ్వాలన్న వర్మ

Ram Gopal Varma: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏదీ చేసిన వివాదాస్ప‌దంగానే ఉంటుంది.

Update: 2021-05-22 17:00 GMT

మోడీ, వర్మ ఫైల్ ఫోటో 

Ram Gopal Varma: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏదీ చేసిన వివాదాస్ప‌దంగానే ఉంటుంది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే వ‌ర్మ ప‌లు సామాజిక అంశాల‌పై స్పందిస్తుంటారు. ఇటీవ‌లే ఆనంద‌య్య మందు గురించి కామెంట్స్ చేస్తూ..ఆనంద‌య్య‌కు నోబెల్ ఇవ్వాల‌ని అన్నారు. ఇక తాజాగా ప్ర‌ధాని మోదీపైనే సెటైర్స్ వేశారు వ‌ర్మ‌. ఇటీవల వారణాసి డాక్టర్లు వైద్య సిబ్బందితో ప్రధాని మోదీ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

దేశంలో కోవిడ్ -19 మరణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఒకానొక సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకొని తన ప్రసంగాన్ని ముందుకు కొనసాగించలేకపోయారు. మోదీ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ దీనిపై ఓ వీడియోను రూపొందించాడు. మోదీ కన్నీళ్లు పెడుతున్న వీడియో తీసుకొని 'ఉత్తమ ఆస్కార్ ప్రదర్శనగా' కామెంట్ చేశాడు. ఆ వీడియోను షోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.



Tags:    

Similar News