Ram Gopal Varma fined by GHMC: వర్మకు షాకిచ్చిన జీహెచ్ఎంసీ.. రూ. 88 వేల జరిమానా

Update: 2020-07-30 05:08 GMT

Ram Gopal Varma fined by GHMC: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మరోసారి జరిమానా విధించింది. జీహెచ్ఎంసీ నిబంధనల్ని పాటించకుండా బహిరంగ ప్రదేశాలలో పోస్టర్లను అంటించినందుకు వర్మకు బుధవారం నాడు రూ.88వేల రూపాయల చెల్లించాలని పేర్కొంటూ బుధవారం ఈ-చలానా జారీ చేసింది.

ఆర్‌జీవీ నిర్మించిన 'పవర్‌స్టార్‌' సినిమాకు సంబంధించిన పోస్టర్లను నగరంలోని పలు ప్రాంతాల్లో అంటించారు. జూలై 21న జూబ్లీహిల్స్‌లో పోస్టర్లు అంటించారని ఒకరు ట్విట్టర్‌ ద్వారా జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు రెండు పోస్టర్లకుగాను రూ.నాలుగు వేలు జరిమానా విధించారు. అయితే ఇదే ప్రాంతంలో దాదాపు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతులు తీసుకోలేదని తేలడంతో రూ.88వేల జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News