D Company: రామ్‌గోపాల్ వర్మ డి-కంపెనీ మూవీ విడుదల
D Company: ఇప్పుడు మాఫియా డాన్ దావుద్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించాడు.
D Company: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని సినిమాగా తీస్తా అంటూ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులపైన సినిమాలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. ఇప్పుడు మాఫియా డాన్ దావుద్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించాడు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా సినిమా తన స్పార్క్ ఓటీటీలో విడుదల అయింది
ఇటీవలే కరోనా వైరస్, దెయ్యం వంటి సినిమాలతో థియేర్లలో ప్రేక్షకుల సహానాన్ని పరీక్షించిన వర్మ. ఈసారి ఓటీటీవైపు దృష్టి పెట్టాడు. నేడు తన సొంత ఓటీటీ సంస్థను పాన్ ఇండియా లెవల్ లో లాంచ్ చేస్తూనే మరో సినిమా విడుదల చేశాడు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం డి-కంపెనీ. దావూద్ ఇబ్రహీం జీవితకథ ఆధారంగా ఈసినిమా రూపొందింది. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలీ, రుద్రకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్పార్క్‌లో స్ట్రీమింగ్ అయింది.
తెలుగు, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలలే పెట్టుకున్నాడు వర్మ. వర్మ అంచనాలు ఈ సినిమా రీచ్ అవుతుందో లేదో చూద్దాం. మరోవైపు తన ఓటీటీ సంస్థ స్పార్క్ లో తెలుగు, హీందీలో పలువురు సెలబ్రీల ద్వారా ప్రచారం కల్పించారు. స్పార్క్ విషయానికి వస్తే ఇందులో ఓటీటీ ప్రేక్షకులు కోరుకొనే అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు, సిరీసులు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఇప్పటికీ ఆహా తన హావాను చూపిస్తుంది. ఈ ఏడాది హిట్ అయిన అన్ని చిత్రాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన దూసుపోతుంది.