Ram Gopal Varma: కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడి మృతి

Ram Gopal Varma: ఆర్జీవీ సోదరుడు పి.సోమశేఖర్ కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.

Update: 2021-05-24 02:10 GMT

Ram Gopal Varma Cousin P Somashekar:(File Image)

Ram Gopal Varma: కరోనా టాలీవుడ్ ప్రముఖులను పగబట్టినట్లే వరుసగా కబళిస్తోంది. వర్మ సోదరుడు సోమశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఈయన ఒక హిందీ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు.. వర్మ తీసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రంగీలా, సత్య, దౌడ్ వంటి సినిమాల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కరోనా మహమ్మారి సోకి.. చికిత్స పొందుతూ నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమశేఖర్ మరణించారు. ఈయన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వరుసకు సోదురుడు అవుతారు. ఆయన పలు సినిమాలకు కూడా పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఆయన ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా రామ్ గోపాల్ వర్మకు దూరంగా ఉంటున్నారు. తన జీవితంలో కీలకమై వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని.. అతడిని చాలా మిస్ అవుతున్నానని ఆర్జీవి అంటుండేవారు.

సత్య సినిమా చిత్రీకరణ సమయంలో ఆర్జీవీ కంటే సోమశేఖర్ ను చూస్తేనే ఎక్కువగా భయం వేసేదని.. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సోమశేఖర్ మృతిపై బోనీ కపూర్ స్పందిస్తూ.. సోమశేఖర్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యాను. తన తల్లికి కరోనా సోకడంతో ఆయన సేవ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయనకు కరోనా సోకినా కూడా తన తల్లిని జాగ్రత్తగా చూసుకున్నారు. తన తల్లిని కాపాడగలిగాడు గానీ.. తన ప్రాణాలను దక్కించుకోలేకపోయాడని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. సోమశేఖర్ మృతి పై పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News