Ram Gopal Varma Clarification : ఆ వార్తలో నిజం లేదు .. వర్మ క్లారిటీ!
Ram Gopal Varma Clarification : లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాడు
Ram Gopal Varma News :లాక్ డౌన్ సమయంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాడు. వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే నగ్నం, క్లైమాక్స్ అనే సినిమాలను 'ఆర్జీవీ వరల్డ్ - శ్రేయాస్ ఈటీ'లో రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అయితే ఆయన చిత్ర బృందంలో ఒకరికి కరోనా వచ్చిందని, దీనితో అయన చేస్తున్న షూటింగులు ఆపేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపైన రామ్ గోపాల్ వర్మ క్లారిటీని ఇచ్చాడు. ఆ వార్తలను కొట్టి పారేస్తూ ట్వీట్ చేశాడు వర్మ.. "మా టీమ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిన కారణంగా మేము షూటింగు పనులు ఆపేశామంటూ ప్రచారం అవుతోన్న వార్తలో నిజం లేదు. నిజానికి షూటింగును మొదలు పెట్టేటప్పుడు మేము అందరికీ కరోనా పరీక్షలు చేయించాం.. అందరికీ నెగిటివ్ అని తేలింది. కరోనా నిబంధనలను మేము కచ్చితంగా పాటిస్తున్నాము" అని వర్మ పేర్కొన్నాడు..
వర్మ పై కేసు :
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత, ప్రణయ్ ల ప్రేమ కథ ఆధారంగా వర్మ 'మర్డర్' అనే సినిమా చేస్తున్నట్టుగా ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వర్మ సినిమా పైన పెద్ద హైప్ క్రియేట్ చేశాడు. దీనిపైన అమృత ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఓ లేఖను కూడా రిలీజ్ చేసింది.
తాజాగా ఈ సినిమాపై ప్రణయ్ కుటుంబ సభ్యుల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్మ తెరకెక్కించే ఈ సినిమాలో తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండలోని ఎస్సీ ఎస్టీ కోర్టుల ఫిర్యాదు దాఖలు చేశాడు. అయితే దీనిపైన స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది.