RGV: రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా
* ఈటల మరియు కేసీఆర్ మధ్య జరిగిన కథ ఇదే అంటున్న రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma: ఒకవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పీకల్లోతు వివాదాల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఒక సెన్సేషనల్ ప్రకటన చేశారు. "వెన్నుపోటు" అనే టైటిల్ తో వర్మ ఒక సినిమాని ప్రకటించారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్, సీఎం కేసీఆర్ కి ఎలా వెన్నుపోటు పొడిచాడు అనేదే ఈ సినిమా కథ అని సమాచారం. నిజానికి కెసిఆర్ మంత్రిగా ఉన్న హుజురాబాద్ మాజీ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ మీద భూముల ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. కెసిఆర్ కావాలని తనపై కుట్ర పన్నుతున్నారని అన్న ఈటల రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
ఈటల రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్టోబర్ 30న పోలింగ్ జరగబోతోంది. కెసిఆర్ పై గెలిచి తన సత్తా నిరూపిస్తాను అని ఈటల సవాల్ కూడా చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని రామ్ గోపాల్ వర్మ ఒక సినిమాగా తీయాలని చూస్తున్నారట. గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటం మరియు ఇది ఒకటేనని ఆయన పోల్చారు. ఏకంగా "వెన్నుపోటు" అనే టైటిల్ తో సినిమా అని కూడా ప్రకటించేశారు. సరిగ్గా ఎన్నికల ముందు రాంగోపాల్ వర్మ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.