సైరా సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభం కూడా అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ హాల్ చల్ చేస్తుంది. అదేంటంటే చిరంజీవి కోసం కొరటాల ఓ పవర్ ఫుల్ స్టొరీ రాసుకున్నాడట. ఇందులో చిరంజీవికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ చిరంజీవిగా చరణ్ ని నటింపజేయాలని కొరటాల భావిస్తున్నట్లు తెలుస్తుంది. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని ముందుగానే ఇవ్వడానికి కొరటాల త్వరలోనే మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. గతంలో చిరంజీవి సినిమాలో చరణ్, చరణ్ సినిమాలో చిరంజీవి కనిపించారు కానీ అది కేవలం ఓ గెస్ట్ అప్పియరెన్స్ వరకే సరిపోయింది. సినిమా కథలో భాగంగా ఇద్దరు ఇప్పటివరకు కలిసి నటించింది అయింది లేదు. ఇది కనుక వర్కౌట్ అయితే మెగా ఫాన్స్ కి పండగ అనే చెప్పాలి..