Ram Charan: కౌ బాయ్ మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?
Ram Charan: ఇది జస్ట్ కొద్దిసేపే కాగా ఇప్పుడు పూర్తి స్థాయి కౌబాయ్ గెటప్ లో సినిమా చేసేందుకు రాంచరణ్ రెడీ అయ్యాడు.
Ram Charan: టాలీవుడ్ నుంచి ఎన్నో జానర్ లో సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని జానర్లు మాత్రమే ఎవర్ర్ గ్రీన్. కౌ బాయ్ చిత్రాలు అలాంటి ఎవర్ర్ గ్రీన్ జానరర్ లోకి వస్తాయి. వీటికి బ్లాక్ అండ్ వైట్ టైమ్ నుంచి నేటి వరకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. తమ అభిమాన హీరోని కౌబాయ్ గెటప్ లో చూడాలని ఫ్యాన్స్ తెగ ఉబలాటపడుతుంటారు. అంతెందుకు కౌబాయ్ జానర్ ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. మే 31న ఆయన పుట్టినరోజు. సూపర్ స్టార్ జన్మదినం పురస్కరించుకొని ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. కృష్ణ నటించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఫ్యాన్స్ కోరిక మేరకే రీరిలీజ్ చేస్తున్నామని ఆ చిత్ర నిర్మాత ఆదిశేషగిరిరావు తెలిపారు.
కృష్ణ తర్వాత ఆ జానర్ లో సినిమాలు చేసింది మెగా స్టార్ చిరంజీవి. కొదమ సింహం చిత్రంలో కౌబాయ్ గెటప్ లో కనిపించి తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత సూపర్ స్టార్ తనయుడు మహేష్ బాబు సైతం టక్కరి దొంగ టైటిల్ తో కౌ బాయ్ చిత్రం చేశారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఆ తర్వాత కొంతమంది హీరోలు ఈ జానర్ లో సినిమాలు చేసినా విజయాలను మాత్రం అందుకోలేకపోయారు. దీంతో ఈ జానర్ కు దూరంగా ఉన్నారు. అయితే కౌ బాయ్ జానర్ సినిమాలు మాత్రం మెగా ఫ్యామిలీకి లక్ తెచ్చిపెట్టాయనే చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి కొదమసింహంతో హిట్టందుకుంటే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బద్రి సినిమాలోని ఒక పాటలో కౌబాయ్ గెటప్ లో కనిపించి ఫ్యాన్స్ కు ఫీస్ట్ చేశాడు. ఈ పాట ఎవర్ర్ గ్రీన్ జాబితాలోకి ఎక్కింది. ఇక మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా తన తొలిచిత్రం చిరుతలో కౌబాయ్ గెటప్ లో కనిపించాడు. ఇది జస్ట్ కొద్దిసేపే కాగా ఇప్పుడు పూర్తి స్థాయి కౌబాయ్ గెటప్ లో సినిమా చేసేందుకు రాంచరణ్ రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదగడంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే త్రీ ఇడియెట్స్, పీకే చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమాను చరణ్ ఓకే చేసుకున్నాడు. ఈ చిత్రంలోనే మెగా పవర్ స్టార్ కౌబాయ్ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి, కౌబాయ్ గెటప్ లో తండ్రిని మించిన హిట్ ను చరణ్ అందుకుంటాడేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.