Ram Charan: ఓరి నాయనో.. రామ్‌చరణ్ కొత్త కారు ధరెంతో తెలుసా.? కళ్లు తేలేయ్యడం ఖాయం..
Ram Charan: ఓరి నాయనో.. రామ్‌చరణ్ కొత్త కారు ధరెంతో తెలుసా.? కళ్లు తేలేయ్యడం ఖాయం..
Ram Charan: సినీ తారలకు కార్లు అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లను తమ గ్యారేజీలో నింపేస్తుంటారు. మార్కెట్లో కొత్త కారు ఏది వచ్చినా వెంటనే కొనేస్తుంటారు. ఇలా కార్లను అత్యంత ఇష్టపడే వారిలో చిరంజీవి ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నట వారసత్వాన్ని అందుకున్న రామ్‌చరణ్ కార్లపై అభిమానాన్ని కూడా తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్నారు. చెర్రీకి కార్లపై ఉన్న మక్కువ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది.
మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన కార్లను కొనుగోలు చేసే చెర్రీ తాజాగా కొత్త కారుతో అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లను మెయింటైన్ చేస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో లగ్జరీ కార్ ను కొనుగోలు చేశారు. రామ్ చరణ్ కొనుగోలు చేసిన ఆ కారు మరెదో కాదు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్ట్రా. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లలో ఇదీ ఒకటి. ఈ కారు ధర అక్షరాల రూ. 7.5 కోట్లు. అయితే ఇది ఎక్స్ షోరూమ్ ధరే, ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చే సరికి మరింత పెరుగుతుంది. ప్రస్తుతం భారత దేశంలో ఇది రెండో కారు కావడం విశేషం.
తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చెర్రీ ఈ కారులో కనిపించాడు. ముంబయిలో జరుగుతున్న అనంతర్ అంబానీ వివాహా వేడుకకకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో చెర్రీ ఇంటి నుంచి స్వయంగా తానే కారును డ్రైవ్ చేస్తూ ఎయిర్ పోర్ట్‌కి చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడుకు రామ్‌చరణ్ తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి వెళ్లారు. ఇదిలా చెర్రీ దగ్గర ఈ కారుతో పాటు.. రూ. 3.2 కోట్ల విలువైన ఆస్టో మార్టిన్ వాంటేజ్, రూ. 3.5 కోట్ల ఫెరారీ ఫోర్టోఫీనో, రూ. 2.75 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబ్రయోగ్రఫీ, రూ. 4 కోట్ల మెర్సిడేజ్ మేబ్యాచ్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.