Game Changer Teaser Launch: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్‌కు ఓకే చెప్పిన యోగి సర్కార్

Update: 2024-11-05 15:00 GMT

Yogi Adityanath to launch Game Changer Teaser: గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. టీజర్ రిలీజ్ డేట్‌తో పాటు ప్లేస్ కూడా అనౌన్స్ చేసింది. గేమ్ ఛేంజర్ మూవీ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరగనుంది. భారీ ఎత్తున ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌తో పాటు మూవీ టీమ్ మొత్తం అటెండ్ కానున్నట్టు తెలుస్తోంది. లక్నోలో సినిమా ఈవెంట్‌ను జరుపుకోనున్న ఫస్ట్ తెలుగు మూవీగా, పాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ నిలవనుంది.

సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 9న ముందుగా టీజర్ విడుదల చేయబోతున్నారు. అది కూడా లక్నోలో. యూపీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు సీఎం యోగి ఆదిత్యనాథ్. అతనేం చెప్పినా, చేసినా దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. అలాంటి యోగి పాలిస్తున్న యూపీ రాజధాని లక్నో నుంచి గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు గేమ్ ఛేంజర్ శాటిలైట్, ఓటీటీ బిజినెస్ కూడా పూర్తయినట్టు సమాచారం. శాటిలైట్ అన్ని భాషలకు కలిపి రూ.70 కోట్లు, ఓటీటీ కూడా దాదాపు రూ.80 కోట్లు, ఆడియో రైట్స్ రూ.30 కోట్లు వరకు అమ్ముడు పోయినట్టు సమాచారం. ఓ రకంగా నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమా రూ.180 కోట్లను సొంతం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ నిజాయితీ గల ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు అణగారిన వర్గాల తరపున పోరాడే ప్రభుత్వాధినేతగా ఎలా ఎదిగాడనేది ఈ మూవీ స్టోరీ. ఇందులో ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ ఫాదర్ అండ్ సన్‌గా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటించారు. వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ ఇది. ఇందులో శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది. గతంలో సంక్రాంతి సీజన్‌లో విడుదలైన రామ్ చరణ్ చిత్రాలు నాయక్, ఎవడు మంచి విజయాలను నమోదు చేయగా.. వినయ విధేయ రామ డిజాస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు రామ్ చరణ్ నాల్గోసారి సంక్రాంతి పోటీలో సై అంటూ ముందుగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్, ఏపీ, ముంబై, చండీగఢ్, న్యూజిలాండ్‌లలో చిత్రీకరించారు. డైరెక్ట‌ర్‌గా శంక‌ర్ చేస్తోన్న ఫ‌స్ట్ తెలుగు మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. శంక‌ర్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ చేసిన గేమ్ ఛేంజ‌ర్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుంద‌న్న‌ది టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కాబోతోంది. మొదట ఈ మూవీని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ బడ్జెట్ పరంగా సంక్రాంతి అయితేనే కలిసొస్తుందనే ఆలోచనతో పండుగకు షిఫ్ట్ అయ్యారు. గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలున్నాయి. అనేక రికార్డులు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. బాక్సీఫీస్ దగ్గర ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

Tags:    

Similar News