తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. చెన్నైలోని కొడంబాకంలో రాఘవేంద్ర పేరుతో రజనీకాంత్‌కు ఓ కల్యాణమండపం ఉంది. ఐతే దానికి సంబంధించి ఆరున్నర లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆయనకు నోటీసులు పంపించింది. వీటిపై రజనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. లాక్‌డౌన్ కారణంగా ఆదాయం లేదని పన్ను చెల్లించలేనని పిటిషన్‌లో తెలిపాడు. దీనిపై ధర్మాసనం మండిపడింది.