Prabhas-Rajamouli: బాహుబలితో తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. ఆ సినిమాతో అటు ప్రభాస్ ని కూడా పాన్ ఇండియా హీరోగా నిలబెట్టాడు. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం పలు దేశాల్లో విడుదలై ప్రపంచ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షంతో రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం అయిదు ఏళ్ళు తమ కాల్షిట్ లను ఇచ్చిన ప్రభాస్ గురించి రాజమౌళి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
అనుకున్న సమయం కంటే సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు అవడంతో "బాహుబలి" సినిమాని నిర్మించిన ఆర్కా బ్యానర్ నిర్మాతలు ప్రభాస్ కి తాము అనుకున్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా ఇస్తామని చెప్పినట్టు ఫోన్ చేశారని, ఆ తర్వాత వెంటనే రాజమౌళి ఫోన్ చేసిన ప్రభాస్ "డార్లింగ్ మన నిర్మాతలు రెమ్యునరేషన్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఇస్తామంటున్నారు.. ఏమి చెప్పాలి" అని తను అడిగిన ప్రశ్నకి "షూటింగ్ లేట్ అయినందుకు ఇస్తామని వాళ్ళే చెప్తుంటే తీసుకోవడానికి ఇబ్బంది ఎందుకని" చెప్పానని దానికి ప్రభాస్ "ఇప్పటికే సినిమా కోసం చాలా ఖర్చు చేస్తున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఎక్కువ రెమ్యునరేషన్ వద్దులే" అని చెప్పినట్లు రాజమౌళి ఒక సందర్భంలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరో పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న రాజమౌళి అటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇక మరోపక్క రాధేశ్యామ్, సలార్, అదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ లో ప్రభాస్ కూడా బిజీబిజీగా గడుపుతున్నాడు.