RRRలో మార్పులు?
ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం RRR (రౌద్రం రుధిరం రణం)..
ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం RRR (రౌద్రం రుధిరం రణం).. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ముందుగా ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో దేశంలో కరోనా వ్యాప్తి పెరగడంతో షూటింగ్ వాయిదా పడింది. దీనితో సినిమా విడుదల ఆలస్యం అవుతుందని నిర్మాత డివివి దానయ్య వెల్లడించారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం సినిమా చిత్రీకరణలకు అనుమతిచ్చిన సంగతి వవిధితమే.. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలని కూడా విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
తక్కువ మందితో ఇండోర్ షూటింగ్ లకి అనుమతి ఇవ్వడంతో RRR కథలో స్వల్ప మార్పులు చేసి వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకునేలా రాజమౌళి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది కాబట్టి.. ఇప్పుడు చేసే మార్పులు కథపై పెద్దగా ప్రభావం చూపవని రాజమౌళి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఇలా చేసిన స్వల్ప మార్పులతో అయిన RRR అనుకున్న టైంకి వస్తుందా? లేదా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.