Raja Raja Chora Movie Collections: ఈ మధ్యనే "గాలి సంపత్" సినిమాతో అలరించిన యువహీరో శ్రీ విష్ణు తాజాగా "రాజ రాజ చోర" అనే మరొక క్రైమ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హసిత్ గోలి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మేఘా ఆకాష్, సునైన హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 19 న విడుదల అయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ అనుకుంటున్న "రాజ రాజ చోర" తాజాగా ఒక పెద్ద రికార్డును సైతం నమోదు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అమెరికాలో విడుదలై ఎక్కువ కలెక్షన్లు చేసిన తెలుగు సినిమాగా "రాజ రాజ చోర" నిలిచింది.
గురువారం విడుదలైన ఈ చిత్రం శనివారం నాటికి అమెరికాలో 106.5 కే డాలర్లు వసూలు చేసి సెకండ్ వేవ్ తర్వాత భారీ కలెక్షన్లు నమోదు చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. అమెరికాలో మాత్రమే కాక ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా "రాజ రాజ చోర" కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా థియేటర్లలో ఇంకొన్ని రోజులు కచ్చితంగా ఉండబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. "బ్రోచేవారెవరురా" సినిమా తర్వాత శ్రీ విష్ణు మళ్ళీ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. అభిషేక్ అగర్వాల్ మరియు టీజీ విశ్వప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు.