చిక్కుల్లో మాజీ సీఎం భార్య రాధికా కుమారస్వామి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి, హీరోయిన్ రాధికా కుమారస్వామి చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి, హీరోయిన్ రాధికా కుమారస్వామి చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి ఖాతా నుంచి పెద్దమొత్తంలో నగదు బదిలీ అయినట్టు గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆమెకు సమన్లు జారీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసుల ఎదుట శుక్రావారం రాధికా కుమారస్వామి విచారణకు హాజరయ్యారు. ఉదయం తన సోదరుడు రవిరాజ్తో పాటు చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమెపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
నిందితుడు అకౌంట్ నుంచి నగదు బదిలీపై రాధిక వివరణ ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓ సినిమాకు సంబంధించి తన బ్యాంక్ అకౌంట్లో 60 లక్షల రూపాయలు జమ అయినట్లు చెప్పారు. అయితే మూవీ యూనిట్ లో ఎలాంటి ఒప్పందం లేకుండా నగదు జమ అయినట్లు వెల్లడించారు. ఆ నగదును తిరిగి వెనక్కి ఇచ్చేసానని రాధిక కుమారస్వామి చెప్పారు. ఈడీ, ఐటీ అధికారులు కూడా రాధికను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
యువరాజ్ అలియాస్ స్వామి RSS కార్యకర్తగా చెప్పుకుంటూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి కొంత మంది యువకుల వద్ద లక్షల రూపాయలు కాజేసిన ఆరోపణల నేపథ్యంలో సీసీబీ పోలీసులు గతేడాది డిసెంబర్లో అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో యువరాజ్ బ్యాంక్ ఖాతా నుంచి 60 లక్షల రూపాలయలు రాధికా కుమారస్వామి ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించారు.